వేణువై వచ్చాను భువనానికి పాట లిరిక్స్

వేణువై వచ్చాను భువనానికి పాట లిరిక్స్


మాతృదేవోభవ : వేణువైవచ్చాను భువనానికి  




వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి||2||
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే||2||
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!హరీ!హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో||2||
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!హరీ!హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
గాలినై పోతాను గగనానికి

No comments