శ్రీ రామదాసు:: అల్లా శ్రీ రామ సాంగ్ తెలుగు లిరిక్స్

శ్రీ రామదాసు:: అల్లా శ్రీ రామ సాంగ్ తెలుగు లిరిక్స్




Album  :: Sri Ramadasu
Song    :: Allah aa…… Shree Rama...
Singer  :: Shanker Mahadevan, Vijay Yesudas




అల్లా ఆ...
శ్రీ రామ................
శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడు
కళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు

తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము
తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము

ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు  మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి....
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిరవాణ నిజధర్మ సమబర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి.....
ఏ మూర్తి ఘన  మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి వునుగని రసమూర్తి
ఆ మూర్తి శ్రీ రామ చంద్రముర్తి

తాగారా  ఆ ఆ...................
తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము

ప ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ
శ్రీ రామ....
ప ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ
కోందండ రామ....
మ ప ని స రి స ని ప ని ప మ
సీతారామ....
మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ
ఆనంద రామ....
మ మ రి మ రి మ రి స రి మ
రామ... జయరామ...
స రి మ 
రామ
స ప మ
రామ
పావన నామ

ఏ వేలుపు ఎల్ల వెలుపులును గొలిచెడి వేలుపు
ఏ వేలుపు ఏడేడు లోకాలకే వేలుపు
ఏ వేలుపు నిట్టుర్పు యిలను నిలుపు
ఏ వేలుపు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేలుపు నిగమ నిగామాలన్నిటిని తెలుపు
ఏ వేలుపు నింగి నేలను కలపు

ఏ వేలుపు ద్యుతిగొల్పు
ఏ వేలుపు మరుగొల్పు
ఏ వేలుపు దే మలపు లేని గెలుపు
ఏ వేలుపు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఏ వేలుపు దాసానుదాసులకు కై వోర్పు

తాగారా...
తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము

11 comments :

  1. Wonderful song & ANR,Nagarjuna performances fantastic

    ReplyDelete
  2. చాలా అర్ధ వంతమైన పాట...చాలా మంచి పాట.కీరవాణి గారికి, పాడిన వారికి ధన్యవాదములు.అలాగే వ్రాసిన వారికి కూడా వందనాలు

    ReplyDelete
  3. Exceptional lyrics by Vedavyas. ఇటీవలి కాలంలో ఇంత చక్కటి కూర్పు, సాహిత్యము, శబ్ద, అర్ధాలంకారాలున్న సినిమా పాట రాలేదు. వేటూరి గారు గోదావరి పాట మరొక్క అరుదైన మాణిక్యం ఇటీవలి కాలంలో.

    ReplyDelete