Udayinchina Suryudinadiga Song Lyrics

Udayinchina Suryudinadiga Song Lyrics


"కలుసుకోవాలని ::హె ఉదయయించిన  సూర్యుడినడిగా లిరిక్స్ "


హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని
చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే

మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం
నీ జాడ తెలిసి మరు నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తాళం నువ్వే
యదను మీటి సుస్వరమై రావే నన్ను చేరవే
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా ( || )

నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడ ఎండల్లె మండుతోంది
కాస్త దూరమే కాద మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే గడియ మన దరికి చేరుకోంది
ఏమి మాయవో ఎమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని
హోయ్ నువు ఎక్కడునావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేక నేలేనని నీకు తెలుపని
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా ( || )

No comments